Friday, December 13, 2024

Proposed Norms For Primary Schools , Upper Primary Schools, High Schools , Cancellation of GO.117 By CSE AP

  chittoorbadi       Friday, December 13, 2024
Proposed Norms For Primary Schools , Upper Primary Schools, High Schools , Cancellation of GO.117 By CSE AP.

విద్యాశాఖ మంత్రి గారి సమావేశంలోని ప్రతిపాదనలు 

పాఠశాలల స్ట్రక్చర్ , ప్రాథమిక పాఠశాలల కొరకు నిబంధనలు , జీవో 117 ప్రభావితాలు,
మున్నగు అంశాలపై చర్చాగోష్టి.బేసిక్ ప్రైమరీలో ప్రీప్రైమరీ–1, 2తో పాటు 1 నుంచి 5 వరకూ క్లాసులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు కొత్తగా మోడల్ ప్రైమరీ పాఠశాలలు ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్ హైస్కూల్  ప్లస్  స్కూళ్లకు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ ప్రాథమిక పాఠశాలలకుఅంగన్వాడీల అనుసంధానం పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పాఠశాలల పునర్ వ్యవస్థీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగించింది. అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హైస్కూల్  ప్లస్ ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. తాజా ప్రతిపాదనల్లో వీటి గురించి పాఠశాల విద్యాశాఖ ప్రస్తావించలేదు. ఇక కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది. అంగన్ వాడీలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు. బేసిక్  ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ–1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. మోడల్  ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగతులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి, ప్రతి తరగతికి ఒక టీచర్  ఉండేలా చర్యలు తీసుకుంటారు. హైస్కూల్  ప్లస్ లకు ప్రత్యామ్నాయంగా బాలికలకు ఇంటర్  విద్య అందించే ఉద్దేశంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్  కాలేజీల విధానం తేవాలని భావిస్తున్నారు. 

పాఠశాలల నిర్మాణం, టీచర్ల కేటాయింపుపై గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 అత్యంత వివాదాస్పదమైంది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది. 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించారు. ఫలితంగా 2,43,540 మంది విద్యార్థులు బడి మారిపోవాల్సి వచ్చింది. ఈ కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 12,247కు పెరిగింది. అనేకమంది విద్యార్థులు ప్రైవేటు బడులకు మారిపోయారు. 2,073 ప్రాథమికోన్నత పాఠశాలలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కోల్పోయాయి. 

గత ప్రభుత్వంలో విలీనం కారణంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేరిన 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మిగిలిన 1,43,410 మందిని తిరిగి ప్రాథమిక పాఠశాలలకు తీసుకొస్తారు. ఫౌండేషనల్ స్కూల్ లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్  టీచర్ ను, బేసిక్  ప్రైమరీ స్కూల్ లో ఒక ఎస్జీటీని కేటాయిస్తారు. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం ప్రకారం కేటాయింపులు చేస్తారు. 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులుండే వాటిని మోడల్  ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించి ప్రతి తరగతికి ఒక టీచర్  చొప్పున కనీసం ఐదుగురిని, విద్యార్థుల సంఖ్య 120 దాటితే ప్రధానోపాధ్యాడి పోస్టును కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న ప్రాంతాల్లో 45 నుంచి 50 మంది విద్యార్థులే ఉన్నా మోడల్  ప్రైమరీ స్కూల్ గా పరిగణిస్తారు.

ప్రతిపాదిత పాఠశాల స్ట్రక్చర్ నందు  మూడు రకాల ప్రాథమిక పాఠశాలలు చేర్చడం జరిగింది.
  1. PP1, PP2, 1st & 2nd classes 
  2. బేసిక్ ప్రైమరీ స్కూల్ ( PP1, PP2, 1-5)
  3. మోడల్ ప్రైమరీ స్కూల్ (PP1, PP2, 1-5)
  4. ప్రాథమికోన్నత పాఠశాలలు లేవు 
  5. హై స్కూల్ నుంచి మూడు నాలుగు ఐదు తరగతులు తొలగింపు 
  6. హై స్కూల్ ప్లస్ పాఠశాలలు తొలగింపు.
Proposed Norms For Primary Schools , Upper Primary Schools, High Schools

Proposed Norms For Primary Schools are as follows.

  1. Mapping of 3rd Class, 4th Class, 5th Classes in High Schools withdrawn and will be mapped to primary schools.
  2. 1,43,410 students will mapped to Primary Schools running with 1 to 5.

AP Primary schools are three types:

  1. Foundational Schools (PP1, PP2, Class 1 &2)       -  Teachers allocated as per RTE
  2. Basic Primary Schools (PP1, PP2, Classes 1 to 5) -  Teachers allocated as per RTE
  3. Model Primary Schools (PP1, PP2, Classes 1 to 5) - Teachers allocated as per RTE

AP Foundational Schools Pattern: 

  1. Teacher and Student Ration :: 1 to 30: 1 SGT.
  2. Teacher and Student Ration ::  From 31 onwards : As per RTE

Basic Primary School

  1. Teacher and Student Ration ::  1 to 30: 1 SGT.
  2. Teacher and Student Ration ::  From 31 onwards : As per RTE

Exception:  

Where ever natural barriers/ artificial barriers are available then only Basic Primary School will run in those places and social category colonies.

  1. Model Primary School (60 and above enrollment in I to V Classes)
  2. Each class one teacher i.e minimum 5 teachers.
  3. After 120 enrollment, one Primary School Head Master post will be allotted.

Note: A Model Primary School will be allowed in each Gram Panchayath.

Exception: Will consider the enrollment for model primary school till 45-50 in some exceptional cases.

PROPOSED NORMS FOR UPPER PRIMARY SCHOOLS

*Downgrading of Upper Primary Schools as Primary స్కూల్స్.

6, 7 and 8 classes enrolment is < 50, shall be downgraded to Primary School and 6,7,8 classes students shall be shifted to nearby High Schools.

Note:- For classes 6, 7, and 8 with an enrollment between 50 and 59 students, this may be reviewed on a case-by-case basis to determine whether the existing Upper Primary School should be downgraded or upgraded.

Up gradation of Upper Primary Schools as  High Schools:

6, 7, 8 classes enrolment is ≥ 60, shall be upgraded as High School.

PROPOSED NORMS FOR HIGH SCHOOLS (VI TO X)

  1. Head Master and SA(Physical Education) will be provided if the enrollment is 276
  2. If the enrollment is < 75, only subject teachers will be provided.
  3. 2nd section will be provided at 54 enrollment.
  4. After this, New section will be provided after every 40 enrollment i.e 94, 134, 174 etc.
  5. After 400 enrolment, second SA(PE) post will be allotted, preference will be given to women SA(PE) and third SA(PE) post will be allotted from 750 enrollment onwards.

Exception: If there is any natural barriers/artificial barriers are there and if any High schools are not available with in radius of 5 KMs, then only the UP School may run / Transport allowance may be provided to the Students.

Proposed Norms For Primary Schools , Upper Primary Schools, High Schools , Cancellation of GO.117 By CSE AP - Click Here To Get File

logoblog

Thanks for reading Proposed Norms For Primary Schools , Upper Primary Schools, High Schools , Cancellation of GO.117 By CSE AP

No comments:

Post a Comment